“బీస్ట్” సినిమా వీక్షించిన తలైవర్..?

Published on Apr 14, 2022 8:00 am IST

లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ సినిమా “బీస్ట్”. ఇళయ తలపటి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. అయితే మొదటి రోజే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ టాక్ రాలేదు.

మిక్సిడ్ రివ్యూస్ తోనే స్టార్ట్ అయిన ఈ సినిమాకి కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి మాత్రం డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ “బీస్ట్” స్పెషల్ షో చూసినట్టు తెలుస్తుంది.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి సన్ పిక్చర్స్ వారి ఆఫీస్ లో ఈ సినిమా స్పెషల్ షో రజిని కోసం వేయగా అక్కడ చూసినట్టుగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై రజిని ఏమన్నా ట్వీట్ చేస్తారో లేదో చూడాలి. మరి ఇదిలా ఉండగా నెక్స్ట్ రజిని ఇదే బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :