టాక్..ఆ హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా “దళపతి 67”.?

టాక్..ఆ హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా “దళపతి 67”.?

Published on Nov 27, 2022 4:39 PM IST

ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తో “వరిసు” అనే సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం తర్వాత విజయ్ తన దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేయనున్న తన 67వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇది కూడా లోకి యూనివర్స్ లో భాగంగా ప్లాన్ చేసిన సినిమానే కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇక ఏ చిత్రంపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని లోకేష్ ప్రముఖ హాలీవుడ్ చిత్రం “వైలెన్స్ ఆఫ్ హిస్టరీ” అనే చిత్రానికి రీమేక్ గా ప్లాన్ చేస్తున్నాడట.

అయితే ఇందులో మెయిన్ లైన్ ని ఈ సినిమాకి తీసుకొని చాలా మార్పులు చేర్పులు చేసి లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాకుండా ఈ చిత్రంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు కూడా ఉంటాయని వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే విజయ్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ రీమేక్ చేస్తున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు