‘వీర సింహారెడ్డి’లో శ్రుతి హాసన్ పాత్ర అదేనా ?

‘వీర సింహారెడ్డి’లో శ్రుతి హాసన్ పాత్ర అదేనా ?

Published on Dec 18, 2022 10:46 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ క్యారెక్టర్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. శ్రుతి హాసన్ సినిమాలో స్కూల్ టీచర్ గా కనిపించబోతుందని, పైగా ఆమె పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వెల్ కి ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని.. మొత్తానికి శ్రుతి హాసన్ పాత్ర సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. అలాగే శ్రుతి హాసన్ పాత్ర కామిక్ యాంగిల్ లో ఉంటుందని తెలుస్తోంది.

కాగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న వీర సింహా రెడ్డి తో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు