‘స్పిరిట్’లో ఇంటర్వెల్ ట్విస్ట్ అదేనా ?

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమా ఇంటర్వెల్ పై ఓ రూమర్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో వెరీ సిన్సియర్ అండ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడని.. ఐతే, ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ పాత్ర ఎదుర్కొంటున్న కేసు వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుందని.. పైగా ఇది హీరో పాత్ర వ్యక్తిగత జీవితానికి, హీరో వెతుకుతున్న విలన్ కి మధ్య బలమైన కనెక్షన్ కి సంబంధించిన ట్విస్ట్ అని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ కచ్చితంగా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

Exit mobile version