మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర అదేనా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. అధికారిక ప్రకటనతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి బాలయ్య నటిస్తున్న పాత్ర ఏమిటో తెలుసా ?.. మోక్షజ్ఞ తండ్రి పాత్రలోనే బాలయ్య కనిపించబోతున్నారని.. సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

ఐతే, మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై నెగిటివ్ టాక్ ఉంది. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ ఒక్కటే పూర్తిస్థాయి విజయం. అటు ‘విశ్వంభర’పై వచ్చిన చర్చ కూడా ఈ నెగిటివ్ టాక్ కి కారణం. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంచుకున్నారనే టాక్ ఉంది. అదే నిజమైతే, “వశిష్ఠ కరెక్ట్ ఛాయిస్ అనుకోవాలేమో. ఏది ఏమైనా సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టమవుతుంది.

Exit mobile version