ఈ భాషలో “ది రాజా సాబ్” డీల్ వాళ్లదేనా?

ఈ భాషలో “ది రాజా సాబ్” డీల్ వాళ్లదేనా?

Published on Oct 24, 2024 9:58 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డేతో టోటల్ ఇండియన్ సినిమా ప్రముఖులు అంతా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేశారు. అలాగే తాను నటిస్తున్న సినిమాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” నుంచి ఊహించని ట్రీట్ నే వచ్చింది. దీనితో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వైరల్ గా మారింది.

ఈ సినిమాకి కన్నడ నిర్మాణ సంస్థ అలాగే ప్రభాస్ తో భారీ సినిమా సలార్ చేసిన హోంబళే ఫిల్మ్స్ వారు రాజా సాబ్ పోస్టర్ తో చాలా కాన్ఫిడెంట్ గా తమ నిర్మాణ సంస్థ లోగో కూడా వేసుకొని తమ సినిమాలా పోస్ట్ చేశారు. దీనితో ఈ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా వారా లేక వీళ్లా అంటూ ఫ్యాన్స్ ఒకింత షాక్ కూడా అయ్యారు.

అయితే రాజా సాబ్ కన్నడ హక్కులు వీరే సొంతం చేసుకొని ఉండొచ్చని చెప్పాలి. రాజా సాబ్ ని పాన్ ఇండియా భాషల్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతానికి మిగతా భాషల్లో ఎవరు హోంబళే వారు పోస్ట్ చేసినట్టుగా రాజా సాబ్ తో చేయలేదు. సో కన్నడ డీల్ వీరికే దాదాపు వెళ్లి ఉండొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు