ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. తెలుగుతో పాటు బాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇపుడు ఇటలీలో షూట్ ను జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మొదట కాస్త లేట్ చేసినా లాక్ డౌన్ అనంతరం దర్శకుడే స్వయంగా సమాచారాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ఇపుడు ఏమన్నా అధికారిక అప్డేట్ నిర్మాణ సంస్థ నుంచి వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈరోజు ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమెపై స్పెషల్ పోస్టర్ గాని సంబంధిత అప్డేట్ ఏమన్నా ఇస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పూజా ఫాన్స్ సహా బాలీవడ్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికి అయితే ప్రభాస్ మరియు పూజాల సెట్స్ నుంచి ఫోటో అయితే బయటకు వచ్చింది కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. మరి యూవీ క్రియేషన్స్ నుంచి ఏమన్నా ట్రీట్ ఉందో లేదో చూడాలి.
