పవన్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ గాసిప్ పై ఎలాంటి నిజం లేదా.?

పవన్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ గాసిప్ పై ఎలాంటి నిజం లేదా.?

Published on Apr 27, 2022 12:30 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాలు మరియు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో చేస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు తన లైనప్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుకున్నారు.

అయితే ఈ లైనప్ లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ సోషల్ డ్రామా “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. అయితే ఆల్రెడీ ఫస్ట్ లుక్ వచ్చిన ఈ సినిమాపై తాజాగా పలు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా నిలిచిపోయింది అని పవన్ వేరే సినిమా చేస్తాడని మొదలయ్యాయి.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. హరీష్ పవన్ లు వేరేగా బిజీగా ఉన్నారు తప్పితే ఈ సినిమా ఆగిపోలేదని టాక్. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా జూన్ లేదా జూలై నుంచి పవన్ లేని సన్నివేశాలతో షూట్ స్టార్ట్ అవుతుంది అని అప్డేట్ ఉంది. తర్వాత పవన్ షూట్ లో పాల్గొననుండగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు