ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా దూసుకెళ్తుంది.
అయితే ఈ సినిమా కూడా థియేటర్స్ లో పార్ట్ 1 లానే ఆలస్యంగానే రావడం ఖరారు అయ్యింది. ముందు అయితే మే నెల మధ్యలో రావచ్చు అని టాక్ వచ్చింది కానీ తర్వాత ప్లాన్ లు మారినట్టు తెలుస్తుంది. కానీ లేటెస్ట్ గా ధురంధర్ 2 పాజిబుల్ ఓటిటి డేట్స్ రెండు వినిపిస్తున్నాయి. ధురంధర్ 2 ని జియో హాట్ స్టార్ వారు ఈ మే 27 లేదా జూన్ 4 నుంచి అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ధురంధర్ 2 లోని రంగ్ దే లాల్ అనే సాంగ్ కి సంబంధించి కోర్ట్ లో లీగల్ ఇష్యూస్ కొన్ని నడుస్తున్నాయి. మేకర్స్ అవన్నీ సెటిల్ చేసుకున్నాకే వస్తుందని తెలుస్తుంది. దాదాపుగా అయితే జూన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. సో ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారు ఇంకా ఎదురు చూడక తప్పదు.
