“భీమ్లా నాయక్” లో అంత స్కోప్ ఉందా..?

Published on Nov 9, 2021 7:32 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల కాంబోలో తెరకెక్కుతున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. ఒక్కో అప్డేట్ తో భారీ అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్ భారీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా పై ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

థమన్ మాట్లాడుతూ ఈ సినిమా ఆల్బమ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఏకంగా 7 పాటలను పెట్టారట. ఒరిజినల్ అయ్యప్పణం కోషియం లో కూడా ఇన్ని పాటలు లేవు. దీనితో ఈ భీమ్లా నాయక్ లో ఇంత స్కోప్ ఉందా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికి మూడు పాటలు వచ్చాయి.

ఇక మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి. వాటిలో పవన్ పాడిన పాట కూడా ఉంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఓ పాట కూడా అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :