టాక్.. ‘హనుమాన్ అన్శ్’ తెలుగు రిలీజ్ కోసం ప్రముఖ సంస్థ!

హిందీ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన లేటెస్ట్ చిత్రమే ‘హనుమాన్ అన్శ్’. ఒక అందమైన భక్తి పారవశ్య చిత్రంగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి రికార్డులు సెట్ చేస్తుంది. అయితే ఈ సినిమా అందుకున్న సంచలన విజయంతో తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ని స్వయంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. కానీ విడుదల కానున్న కొన్ని రోజుల ముందే పలు ఊహించని కారణాలు చేత త్రివిక్రమ్ తప్పుకున్నారు. దీనితో తెలుగు రిలీజ్ లేదనే అనుకున్నారు అంతా..

కానీ ఇప్పుడు తెలుగు సహా సౌత్ రిలీజ్ కోసం ప్రముఖ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ముందుకు వచ్చినట్టుగా వినిపిస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో హిందీ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ చిత్రాన్ని కూడా వీరే బ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డివోషనల్ సినిమా విడుదల చేయనున్నారు అని చెప్పొచ్చు.

Exit mobile version