మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్ నిజమేనా?

మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్ నిజమేనా?

Published on Dec 6, 2022 5:46 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మరి ఈ చిత్రం అయితే ఉంటుందని ఆల్రెడీ చాలా మంది అనుకుంటుండగా దర్శకుడు రాజమౌళి పేరు కూడా తన RRR తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వినిపిస్తుండడంతో ఆ సినిమాపై ఆటోమేటిక్ ఆ అపీల్ అయితే వచ్చేసింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై అయితే మరో క్రేజీ రూమర్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రం హాలీవుడ్ రిలీజ్ కి కూడా పాజిబుల్ ఉందని హాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ బ్యానర్ ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ పరంగా ఆసక్తిగా ఉన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ తరహాలో అయితే గతంలో RRR రిలీజ్ టైం లో కూడా వినిపించాయి. కానీ మహేష్ సినిమా విషయంలో ఇవి ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు