టాక్..”పుష్ప 2″ నుంచి తప్పుకుంటున్న స్టార్ నటుడు.?

Published on Dec 29, 2022 11:21 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప ది రూల్” కూడా ఒకటి. మొదటి భాగం పుష్ప ది రైజ్ పాన్ ఇండియా వైడ్ గత ఏడాది ఇదే డిసెంబర్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ కాగా దీనిపై అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ సెట్టయ్యింది.

ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ కొద్ది మేర స్టార్ట్ అయ్యింది కానీ ఇది స్టార్ట్ కావడానికి కూడా చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. మొదటి చిత్రం పుష్ప లో సాలిడ్ క్యామియో లో కనిపించి ఆసక్తి రేపిన నటుడు ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీనితో నెక్స్ట్ పుష్ప వర్సెస్ షెకావత్ పోటీ గట్టిగా ఉంటుందని అందరికీ అర్ధం అయ్యింది కానీ ఇపుడు సినిమా డిలే అవుతూ వస్తుండడం వల్ల ఫహద్ అయితే సినిమా నుంచి తప్పుకున్నాడని, ఇతర సినిమాలు కమిట్మెంట్స్ ఈ సినిమా షూట్ లేట్ అవుతూ ఉండడం తో ఇలా చేసాడని కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ పార్ట్ లో తన పాత్ర ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటిది తాను కనిపించడు అంటే నమ్మే మాట కాదు. సో ప్రస్తుతానికి ఈ వార్తలు అవాస్తవం అనే చెప్పాలి. మరి దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :