ఇంట్రెస్టింగ్..తారక్ నుంచి ట్రిపుల్ ధమాకా..?

Published on May 11, 2022 7:03 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో ముందుగా భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా చేయనుండగా దానిపై తన బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి ఓ కీలక అప్డేట్ రాబోతుందని గట్టి టాక్ ఉండగా ఇంకో పక్క ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేసే ఎన్టీఆర్ 31వ సినిమాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉండొచ్చని తెలుస్తుంది.

ఇక్కడితో రెండు కాగా మూడోది అదే మే 20న తారక్ బర్త్ డే నాడే ఓటిటి లో “రౌద్రం రణం రుధిరం” చిత్రం అందుబాటులోకి రాబోతుంది. దీనితో ఆ రోజు మాత్రం ఎన్టీఆర్ నుంచి ట్రిపుల్ ధమాకా కన్ఫర్మ్ అన్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి వీటిపై అయితే ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఇదే టాక్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :