పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇది వరకే చాలా కంటెంట్ వచ్చింది. టీజర్, పాటలు, గ్లింప్స్ ఇలా చాలానే వచ్చాయి.
ఇక మరింత కంటెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఇవాళ ఓ సాలిడ్ కంటెంట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మేకర్స్ ఓ మాస్ డైలాగ్ తో కూడిన ప్రీల్యూడ్ లాంటి దాన్ని వదిలే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
హరీష్ శంకర్ నెమ్మదిగా ఒకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేస్తున్నారు. మరి ఈ రానున్న ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ రాశిఖన్నా మరియు శ్రీలీల నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
