విజయ్ “వారిసు” రన్ టైం లాక్డ్.?

Published on Dec 15, 2022 4:00 pm IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఇక తెలుగు సహా తమిళ్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సహా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై అయితే ఓ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రం టోటల్ రన్ టైం గా రీసెంట్ మొత్తం లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇది ఎంతంటే 150 నిమిషాల సినిమాగా అయితే మేకర్స్ కట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ చిత్రం సుమారు 2 గంటల 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :