బాలయ్య డేట్ పై కన్నేసిన వెంకీ మామ.?

Published on Sep 15, 2021 6:04 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ కావస్తున్నా ఈ చిత్రం బహుశా రానున్న దసరా రేస్ నుంచి తప్పుకోనుంది అని తెలిసింది. అయితే ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13 న రిలీజ్ అవుతుంది అని బజ్ రాగా పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఈ చిత్రం డేట్ కి వెంకీ మామ వచ్చేలా ఉన్నాడని ఇప్పుడు నయా టాక్.

అయితే వెంకీ మామ రీసెంట్ గా నటించిన “నారప్ప” చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యి భయారే హిట్ అయ్యింది. అలాగే ఈ రకపు రిలీజ్ పట్ల కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ని కూడా అందుకుంది. అందుకే తన మరో సినిమా “దృశ్యం 2” ని థియేట్రికల్ రిలీజ్ చేసే సూచనలు ఉన్నాయని ఆ మధ్య టాక్ రాగా ఇప్పుడు అది అక్టోబర్ కి రానుందా అని సరికొత్త ప్రశ్న బయటకి వచ్చింది అది కూడా బాలయ్య అఖండ డేట్ కే ఏమో అని మరో ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వీటిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :