“దలపతి 66″లో విజయ్ డబుల్ రోల్ పై క్లారిటీ ఇదేనా.?

Published on May 23, 2022 10:58 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లితో తన కెరీర్ లో 66వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిసారిగా విజయ్ ఈ సినిమాతో తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఈ చిత్రంలో విజయ్ రోల్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే కొన్ని రోజులు కితం వినిపించింది.

ఈ చిత్రంలో తాను డబుల్ రోల్ లో కనిపిస్తాడని తెలిసింది. అయితే లేటెస్ట్ గా ఇది కన్ఫర్మ్ అన్నట్టే అనిపిస్తుంది. గత కొన్ని రోజులు కితం సెట్స్ నుంచి ఒక యంగ్ లుక్ బయటకి రాగా ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ తాము చాలా రోజులు తర్వాత కలిసినట్టుగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో ని షేర్ చేసుకున్నారు.

దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ అవుతుంది అలాగే ఇందులో విజయ్ కూడా కూడా మంచి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో మళ్ళీ విజయ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ మరియు కాస్త ఓల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఈ సినిమాలో డబుల్ రోల్ కన్ఫర్మ్ అన్నట్టుగా అర్ధం అవుతుంది మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :