ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “విక్రాంత్ రోణ”..?

Published on Jul 30, 2022 5:28 pm IST


కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ హిట్ కేజీయఫ్ 2 తర్వాత మంచి అంచనాలతో వచ్చిన మరో చిత్రమే “విక్రాంత్ రోణ”. దర్శకుడు అనూప్ భండారి తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాది మరో మంచి ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా మన తెలుగులో కూడా ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇక ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ కి సంబంధించి అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అఫీషియల్ గా అయితే ఎక్కడా అనౌన్స్ కాలేదు కానీ ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 వారు అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరి కొన్నాళ్ల తర్వాత అయితే ఈ సినిమా జీ 5 లో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా సుదీప్ మరియు షాలిని ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో 3డి లో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :