తమిళ స్టార్ హీరో అండ్ వర్సటైల్ యాక్టర్ విశాల్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విశాల్ కూడా తన పెళ్ళికి సంబంధించి క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా విశాల్, తమిళ హీరోయిన్ సాయి ధన్సికతో ఏడడుగులు వేయనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ఈ పుకార్ల సారాంశం. ఐతే, ఇప్పటివరకూ ఈ వార్తలను ఉద్దేశించి విశాల్ మాత్రం స్పందించలేదు.
అటు సాయి ధన్సిక కూడా స్పందించలేదు. విశాల్ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన వివాహంపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మి, అభినయ వంటి పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వార్తల్లో నిలిచినప్పటికీ చివరికి అవన్నీ ప్రచారస్థాయిలోనే ఆగిపోయాయి. ‘నడిగర్ సంఘం’ బిల్డింగ్ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో ఆయన ప్రకటించారు. ఈక్రమంలోనే ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తైంది. మరి విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.