రెండో సినిమాకు సిద్దమవుతున్న పూరి హీరో !

ఈ మహద్య కాలంలో పూరి పరిచయం హీరోల్లో ఇషాన్ కూడా ఒకరు. ఈ ఏడాదే రిలీజైన ‘రోగ్’ సినిమాతో ఇషాన్ వెండి తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం రెండో సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ‘గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం’ చిత్రాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఇషాన్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడట. సి.ఆర్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇందులో హీరోయిన్, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.