వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ”

Published on Sep 14, 2021 11:30 am IST


తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయిన కొద్ది రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం త్వరలో జెమిని టీవీ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా జెమిని టీవీ ఇందుకు సంబంధించిన వీడియో ని విడుదల చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన విడుదల తేదీ ను త్వరలో ప్రకటించనుంది.

తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. రతీష్ రవి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. సూపర్ గుడ్ ఫిలింస్ మరియు మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాల పై పారస్ జైన్, వాకడ అంజన్ కుమార్, ఆర్బీ చౌదరీ, ప్రసాద్ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :