ఆకట్టుకుంటున్న తేజ ‘ఇష్క్’ రిలీజ్ ట్రైలర్..!

Published on Jul 27, 2021 8:00 pm IST

జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్’- నాట్‌ ఎ లవ్‌స్టోరీ. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30వ తేదిన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా చిత్ర బృందం రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది. రొమాంటిక్‌, థ్రిల్లింగ్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జాంబీ రెడ్డి హిట్ తర్వాత తేజ నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :