
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయ్యింది. అయినా టైం దొరికినప్పుడల్లా మాజీ భర్తపై తన ప్రేమను చాటుకుంటుంది రేణు దేశాయ్. దర్శకురాలిగా మారిన రేణు దేశాయ్ తన మాతృభాష మరాఠీలో రూపొందిస్తున్న సినిమా ‘ఇష్క్ వాలా లవ్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఇది. ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్ ను సెప్టెంబర్ 2 తేది 2014న విడుదల చేస్తున్నాం అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఖుషి, పులి చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా కోసం రెండు పాటలకు సంగీతం అందించారు. ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్టు గతంలో రేణు దేశాయ్ తెలిపారు.