వినాయక చవితి శుభాకాంక్షలతో “ఖిలాడి” నుండి ఇష్టం లిరికల్ సాంగ్ విడుదల!

Published on Sep 10, 2021 11:43 am IST


రవి తేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ హీరోయిన్లు గా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం లోని ఇష్టం అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది.

ఖిలాడి చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ మణి లిరిక్స్ రాయగా, హారి ప్రియ ఇష్టం పాటను పాడటం జరిగింది. ఈ పాట వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయడం జరిగింది. ఈ పాట పూర్తిగా మెలోడియస్ గా ఉండటం తో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

లిరికల్ సాంగ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :