‘ఇజం’ ఆడియో రిలీజ్ డేట్!

2nd, October 2016 - 09:42:11 AM

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక అక్టోబర్ రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ విడుదల కానున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను అక్టోబర్ 5న జరపనున్నట్లు పూరీ జగన్నాథ్ స్పష్టం చేశారు.

అనూప్ రూబెన్స్ సమకూర్చిన ఆడియోలో పూరీ జగన్నాథ్ ఓ పాట రాయడంతో పాటు స్వయంగా పాడడం విశేషంగా చెప్పుకోవాలి. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత సరికొత్త లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. పూరీ స్టైల్ కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో మెండుగా ఉన్నాయని సమాచారం.