అక్టోబర్ నెలకు షిఫ్ట్ అయిన ‘ఇజం’!

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కావాల్సింది. దసరా సీజన్‌కు ఫిక్స్ అయిన సినిమాల్లో ఇజం మొదట్నుంచీ ఒక క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా సినిమా అనుకున్న తేదీకి విడుదల కావట్లేదని, అక్టోబర్‌లో విడుదలవుతుందని టీమ్ ప్రకటించేసింది. ప్రొడక్షన్ పనులింకా పూర్తవ్వకపోవడం వల్లనే సినిమా అక్టోబర్ నెలకు షిఫ్ట్ అయినట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ హైప్ ఉన్న సినిమాగా ‘ఇజం’ నిలిచిందన్న విషయం టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఋజువైంది. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఏ వారం సినిమా విడుదలవుతుందనేది టీమ్ త్వరలోనే ప్రకటించనుంది.