ఖిలాడి నుండి ఇష్టం సాంగ్ ప్రోమో విడుదల!

Published on Sep 7, 2021 7:50 pm IST


రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం ను యూ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఇష్టం సాంగ్ ను ఈ నెల 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

రవితేజ సింపుల్ గా స్టైల్ గా కనిపిస్తూ ఇష్టం ప్రోమో సాంగ్ ఉంది. ఈ వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల కానున్న ఈ పాట సినిమా లో మంచి మెలోడీ గా ఉండే అవకాశం వుంది. రవితేజ ఫ్యాన్స్ కి కచ్చితంగా మరొక చార్ట్ బస్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో సాంగ్ ను విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. వీలైన త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :