లెజెండ్ ఎన్టీఆర్ గారిని శతజయంతి సందర్భంగా స్మరించుకోవడం ఆనందంగా ఉంది – మహేష్ బాబు

Published on May 20, 2023 9:04 pm IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా మొదటి సినిమా నుండి తనకంటూ ప్రత్యేకంగా పేరు ప్రఖ్యాతలు అలానే ఆడియన్స్ లో గొప్ప ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు లెజెండరీ యాక్టర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు.

దాదాపుగా 300 పైచిలుకు సినిమాల్లో పలు పాత్రలతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పి, అలానే అటు రాజకీయాల్లో కూడా తిరుగులేని వ్యక్తిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఎన్టీఆర్ గారి శతజయంతి వేడుకలు నేడు అనగా మే 20న హైదరాబాద్ కేపీహెచ్బి లోని కైతలపూర్ గ్రౌండ్స్ లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. కాగా నేడు ఆ మహనీయుడిని స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు సినిమాని శాశ్వతంగా తీర్చిదిద్దిన లెజెండ్ యొక్క వారసత్వం మరియు కాలాతీత ప్రభావానికి గౌరవం అంటూ ఎన్టీఆర్ ని కొనియాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ చేసారు. కాగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :