లేటెస్ట్ : ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

లేటెస్ట్ : ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Published on Nov 25, 2022 11:58 PM IST


అల్లరి నరేష్ హీరోగా ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలు ఎంతో గ్రాండ్ గా నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ మూవీకి రామ్ రెడ్డి డీవోపీ గా వర్క్ చేసారు. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ పై మొదటి నుండి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు హీరోగా నటించిన అల్లరి నరేష్ తన పాత్రలో బాగా నటించారని పలువురు అభినందనలు కురిపిస్తున్నారు. కాగా తమ మూవీకి పాజిటివి స్పందన వస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ టీమ్ మొత్తం పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆడియన్స్ అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని, అలానే రాబోయే రోజుల్లో మూవీ మరింతగా పెర్ఫార్మ్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు యూనిట్ సభ్యులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు