నటి అనుకృతిని పెళ్ళాడిన జేడీ చక్రవర్తి!

jd-chakravarthy
జేడీ చక్రవర్తి.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినీ సంచలనం ‘శివ’తో నటుడిగా పరిచయమై, ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా విభిన్న పాత్రల్లో మెప్పించిన వ్యక్తి. మొదట్నుంచీ వివాహ బంధంపై తనకు ఆసక్తి లేదంటూ తెలుపుతూ వచ్చిన ఆయన, తాజాగా అనూహ్యంగా నిన్న ఓ ఇంటివాడయ్యారు. తల్లి శాంతా కోరికమేరకు జేడీ చక్రవర్తి, నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యన నటి అనుకృతిని పెళ్ళాడారు.

గతంలో అనుకృతి, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అనౌన్స్ అయి ఆగిపోయిన ‘శ్రీదేవి’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మొదట్నుంచీ పెళ్ళికి నిరాకరించిన జేడీ, 46 ఏళ్ళకు ఓ ఇంటివాడవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఆయన కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కే ఓ క్రైమ్ కామెడీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు.