టీంవర్క్ తో చేసిన సినిమా అంటున్న దర్శకుడు !

మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఆచరి అమెరికా యాత్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ… మంచి కథ, కథనం ఉన్న సినిమా ఆచరి అమెరికా యాత్ర. టీంవర్క్ గా ఈ సినిమాను చేసాము. కథను నమ్మి చేసిన సినిమా కావున ఈ మూవీ తప్పకుండ అనీ వర్గాల వారిని అలరిస్తుందని నమ్మకంగా ఉందని తెలిపారు

డార్లింగ్ స్వామీ మాటలు రాసిన ఈ సినిమాకు విక్రమ్ రాజ్ స్క్రీన్ ప్లే అందించారు. జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించగా . పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మించారు. ప్రజ్ఞ్య జస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రవీణ్, ప్రభాస్ శ్రీను చేసిన కామెడి ఎపిసోడ్స్ బాగా వచ్చాయని సమాచారం.