భాదను కూడా పాజిటివ్ గా తీసుకున్న నాగార్జున !

14th, November 2017 - 12:09:22 PM

అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల విలువైన సినిమా సెట్ దగ్ధమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరిసారిగా నటించిన ‘మనం’ సినిమాను ఈ సెట్స్ లోనే చిత్రీకరించడంతో దానితో నాగార్జున కుటుంబానికి ప్రత్యేక అనుభంధం ఏర్పడింది. అలాంటి సెంటిమెంట్ కలిగిన సెట్ అగ్నికి ఆహుతవడంతో అక్కినేని కుటుంబం కొంత మనస్తాపం చెందింది.

కానీ ఆ వెంటనే కోలుకున్న నాగార్జున ఆ విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుని ఈ వారం చాలా భావోద్వేగమైంది. కొంత నవ్వుకున్నాం, కొంత బాధపడ్డాం. ఇక ఇప్పుడు అఖిల్ ‘హలో’ సినిమా ప్రమోషన్లను ఈరోజు సాయంత్రం మొదలుపెట్టబోతున్నాం అంటూ వెంటనే తదుపరి భాద్యతల్లోకి దిగేశారు. ‘హలో’ సినిమాకు సంబందించి కొత్త విశేషం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ కానుంది.