ఆఫీషియల్ : “లవ్ స్టోరీ” కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

Published on Sep 10, 2021 4:23 pm IST


అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. తెలుగు ఆడియెన్స్ ఎపుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈరోజు వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి ఈ డేట్ న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇది వరకు వచ్చిన సమాచారం ప్రకారమే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సో ఎట్టకేలకు ఫైనల్ గా లవ్ స్టోరీ కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందివ్వగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అమిగోస్ వారు కలిపి సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :