మ్యూజికల్ వీడియోతో డిసైడ్ చేసేసిన పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమా విషయంలో ఎలాంటి వార్త అందక నిరాశలో ఉన్న అభిమానుల ఆకలి తీరింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకని పురస్కరించుకుని చిత్ర యూనిట్ మ్యూజికల్ వీడియోని ఈ తెల్లవారు జామున విడుదల చేశారు. మ్యూజిక్ సంచలనం అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుధ్ ‘బైటికొచ్చి’ అనే పాటని పాడుతుండగా, పక్కనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న వీడియోని విడుదల చేశారు. వీడియో చివర్లో చిత్రంలోని ఫైట్ సీన్ లో పవన్ ఉన్న ఓ షాట్ ని చూపించారు.

అనిరుద్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పటికే వైరల్ గా మారిపోయింది. దాదాపు ఒక నిమిషం సాగె ఈ పాటలో లిరిక్స్ ట్రెండీగా ఉన్నాయి. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ మ్యూజికల్ వీడియో వలన అంచనాలు మరింత భారిస్థాయికి చేరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా చిత్ర విడుదల విషయం లో నెలకొన్న సందేహాల్ని కూడా త్రివిక్రమ్ క్లియర్ చేసేశాడు. జనవరి 10, 2018 న విడుదల కానున్నట్లు వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించేశారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సంబరాలు, మరో వైపు పవన్ కొత్త చిత్ర విశేషాలతో ఫాన్స్ ఖుషీగా ఉన్నారు.