ఆఫీషియల్ : “RRR” వాయిదా..రిలీజ్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Sep 11, 2021 12:53 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా వద్ద ఎంతో ఆసక్తికరంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో మెగాపవర్ స్టార్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుపుకొని ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

అయితే పరిస్థితులు రీత్యా సినిమా షూట్ అంతా కంప్లీట్ అయ్యినప్పటికీ సినిమా ఆన్ టైం రిలీజ్ పై అనుమానాలు లేకపోలేవు.. మరి వాటిని నిజం చేస్తూ మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో దసరా రేస్ కి గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసిన ఈ భారీ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడ్డట్టు కన్ఫర్మ్ చేశారు.

అయితే చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా రిలీజ్ డేట్ అప్పుడే అనౌన్స్ చేసే అవకాశం లేదు అన్నట్టుగా తెలుపుతున్నారు. వరల్డ్ వైడ్ గా సినిమా థియేటర్స్ ఎప్పుడు అయితే తెరుచుకుంటాయో అప్పుడే సినిమా ఉంటుంది అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. సో ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారింగ్ థ్రిల్లర్ ని ఈ ఏడాది విట్నెస్ చెయ్యలేం అని చెప్పాలి.

కానీ మరో పక్క ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో జనవరి 8న రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయని టాక్ ఉంది. మరి ఇప్పుడు మేకర్స్ ప్రకటన బట్టి ఒకవేళ అప్పటికీ వరల్డ్ వైడ్ పరిస్థితులు చక్కబడకుంటే అప్పటికీ కూడా కష్టమే అని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రం విడుదల కాలమే డిసైడ్ చెయ్యాలి.

సంబంధిత సమాచారం :