దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వీక్షకులు మంచి కంటెంట్ దొరుకుంతుంది. అలాగే ఈ స్ట్రీమింగ్ యాప్ లో సరికొత్త సినిమాలతో పాటుగా అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. వాటిలో మన దేశానికీ సంబంధించిన సిరీస్ లు కూడా చాలానే ఉన్నాయి. మరి అలాంటి వాటిలో నోటెడ్ సిరీస్ ల జాబితా కనుక తీస్తే వాటిలో “ది ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ ఖచ్చితంగా నిలుస్తుంది.
అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్న మొదటి సీజన్ కు కొనసాగింపుగా రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అయితే గత కొన్ని రోజుల నుంచి టీజ్ చేస్తున్న ప్రైమ్ వీడియో వారు లేటెస్ట్ గా ఓ ఆసక్తికర టీజర్ తో రివీల్ చేసారు. ఈ సిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంతా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆమె ఇందులో విలన్ రోల్ లో కనిపిస్తుందని టాక్.
మరి అందుకు తగ్గట్టుగానే మెయిన్ లీడ్ మనోజ్ భాజ్ పై వెనుక అనేక పోస్టర్స్ తో సమంతా ఫ్రేమ్ వచ్చేలా డిజైన్ చేశారు. అంతే కాకుండా “శ్రీకాంత్ మిషన్ వెనుక ఒక విలన్ ఆ విలన్ శ్రీకాంత్ వెనుక ఉంది” అన్నట్టుగా ఈ టీజర్ లో మనోజ్ భాజ్ పై వెనుక సమంతా పోస్టర్ ను చూపిస్తున్నారు.
అంటే ఈ సిరీస్ లో సమంతా చాలా స్ట్రాంగ్ రోల్ లోనే కనిపిస్తున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు. మరి రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ఈ ప్రైడ్ ఇండియన్ సిరీస్ వచ్చే ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నట్టుగా అధికారిక క్లారిటీ ఇచ్చేసారు. సో అప్పటికి అంతా టైం ఫిక్స్ చేసుకుంటే చాలు.
Srikant mission ke peeche aur villain Srikant ke peeche!#TheFamilyManOnPrime, February 12! @SrikantTFM @BajpayeeManoj @Samanthaprabhu2 @Priyamani6 @sharibhashmi @shreya_dhan13 @rajndk @Suparn @hinduja_sunny @DarshanKumaar @SharadK7 @vedantsinha411 @RavindraVijay1 @mimegopi pic.twitter.com/NpQWXhq7ET
— prime video IN (@PrimeVideoIN) January 7, 2021
