అఫీషియల్ : వంశీ, థలపతి ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్.!

Published on Sep 26, 2021 5:35 pm IST

ఇళయ థలపతి విజయ్ మార్కెట్ కోసం అందరికీ తెలిసిందే.. తన సినిమా హిట్ టాక్ వస్తే తమిళ్ లో 200 కోట్లు ఈజీ మార్క్.. మరి అలాంటి విజయ్ ఇపుడు తెలుగు మార్కెట్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇది వరకు జస్ట్ డబ్బింగ్ సినిమాల్తో వచ్చి హిట్స్ అందుకున్న ఇప్పుడు తెలుగులో దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఎప్పుడు నుంచో ఉన్న టాక్.

అయితే మరి ఇప్పుడు అది అధికారికంగా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించాడు. తాను తన హోమ్ బ్యానర్ దిల్ రాజు నిర్మాణ సంస్థలో విజయ్ తో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఎగ్జైటింగ్ అప్డేట్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని వంశీ తెలిపారు. మరి విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :