
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి చేసిన వేడుకల్లో హుదూద్ బాధితుల కోసం చేసిన ‘మేము సైతం’ అనే కార్యక్రమం మాత్రం ఎప్పటికీ మరచిపోలేనిది. గత 20 రోజులుగా వార్తల్లో నిలిచిన ఈ మేము సైతం ప్రోగ్రాంకి నిన్నటితో తెరపడింది. చాలా గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకి ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోస్, హీరోయిన్స్ హాజరయ్యారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేసి మరీ అందరినీ మెప్పించారు.
హుదూద్ బాధితుల కోసం చేసిన ఈ వేడుక చాలా విజయవంతం అయ్యింది. ఇకపోతే ఈ వేడుక ద్వారా వచ్చిన 11 కోట్ల 51 లక్షల విరాళాన్ని అందించారు. ఈ అమౌంట్ ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందించారు. అంతే కాకుండా బాలకృష్ణ హిందూపూర్ ప్రజలంతా కలిసి 43 లక్షలు డొనేట్ చేస్తే, మనబాలయ్య. కామ్ వారు 1.11 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే జెమిని టీవీ 3.5 కోట్లు, బిగ్ సి వాళ్ళు 15 లక్షలు, మలబార్ గోల్డ్ వాళ్ళు 13 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మేముసైతం సైట్ ద్వారా 20 లక్షల డొనేషన్ వచ్చింది. నిన్నటితో ఈవెంట్ అయిపోయినప్పటికీ ఇంకా చాల అమంది విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఈ ఫండ్ డొనేషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు అందుకే టాలీవుడ్ కూడా ఆ డొనేషన్స్ ని స్వీకరిస్తోంది.