సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’

Published on Mar 11, 2023 12:00 am IST

నాగ శౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామలీ ఎంటర్టైనర్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై వారిలో బాగా అంచనాలు ఏర్పరిచాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.

ఈ మూవీలో శ్రీనివాస్‌ అవసరాల, మేఘ చౌదరి, అశోక్‌ కుమార్‌, అభిషేక్‌ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావ్‌, అర్జున్‌ ప్రసాద్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే నేడు ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కాగా దీనికి సెన్సార్ వారు యు/ ఏ సర్టిఫికెట్ కేటాయించారు. తప్పకుండా తమ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ యొక్క అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :