సినిమాల తర్వాతనే హనీమూన్ అంటున్న సమంత, చైతూ!


అక్కినేని వారి ఇంట మరో మూడు రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 6, 7 తేదీలలో అక్కినేని హీరో చైతన్య , అందాల బొమ్మ సమంత పెళ్లి పీటలు ఎక్కకున్నారు. రెండు రోజులు హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరగనుంది. అయితే పెళ్లి అయిన తర్వాత వీరు హనీమూన్ ప్లాన్ చేసుకుంటారని కొద్ది రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తారని అందరు అనుకున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాత యధావిధిగా మరల పెండింగ్ లో ఉన్న సినిమాలని కంప్లీట్ చేసే పనిలో సమంత, చైతూ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకొని సినిమా తర్వాతనే హనీమూన్ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. సమంత, చైతూ చేస్తున్న సినిమాల షూటింగ్ మొత్తం పూర్తయ్యాక, డిసెంబర్ లాస్ట్ లో గాని, జనవరి ఫస్ట్ తర్వాత గాని హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.