ప్రభాస్ “రాధే శ్యామ్” జాన్ హై మెరీ కి హ్యూజ్ రెస్పాన్స్!

Published on Feb 25, 2022 5:31 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం ను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగు లో కంటే కూడా బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఎక్కువే అని చెప్పాలి. ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న అన్ని వీడియో లకి, సాంగ్స్ కి అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదల అయిన జాన్ హై మెరీ పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లవ్ స్టోరీ కావడం, దానికి తోడు విజువల్ వండర్ గా ఉండటం తో పాటుగా, వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రతి సినిమా కి గ్యాప్ కూడా ఉండటం తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మార్చ్ 11, 2022 న భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :