బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈటివి కార్యక్రమం జబర్దస్త్. ఈ వారం అంతకుమించి ఎంటర్ టైన్మెంట్ తో జబర్దస్త్ సిద్దం గా ఉంది. తాజాగా విడుదల అయిన జబర్దస్త్ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరం గా సాగింది. హైపర్ ఆది స్కిట్ నుండి అదిరే అభి స్కిట్ వరకూ షో లో నవ్వులు పూయించారు అని చెప్పాలి.
మేనేజర్ గా హైపర్ ఆది స్కిట్ ను చాలా అద్భుతంగా డీల్ చేసినట్లు తెలుస్తోంది. రాకెట్ రాఘవ నారప్ప గెటప్ తో ఎంట్రీ ఇచ్చి స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించారు. చలాకి చంటి సింగం సినిమా లో పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కామెడీ పండించారు. అదిరే అభి ఫోన్ ను ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాని పై స్కిట్ చేసి అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా, సందేశాత్మకంగా ఉండే విధంగా స్కిట్ చేయడం జరిగింది. మొత్తం గా ఈ వారం జబర్దస్త్ అంతకు మించి ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఆగస్ట్ 19 వ తేదీన పూర్తి ఎపిసొడ్ ఈటివి లో ప్రసారం కానుంది.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
