వచ్చే వారం జబర్దస్త్‌ని మాత్రం అసలు మిస్ కాకుడదండోయ్..!

Published on Jul 30, 2021 2:00 am IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అని అడగాగానే టక్కున గుర్తొచే పేర్లు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి “జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే వచ్చే వారం జబర్దస్త్‌ని మాత్రం అసలు మిస్ కాకుడదనేలా అనిపిస్తుంది.

అయితే పవర్ ఫుల్ పంచెస్‌తో హైపర్ ఆది ఎప్పటిలాగానే చెలరేగిపోయాడు. తన టీంలోకి గెస్ట్‌గా వచ్చిన యాంకర్ విష్ణు ప్రియను ఆది ఓ ఆటాడేసుకున్నాడు. ఇక ఫంటాస్టిక్ ఫన్‌తో అదిరే అభి టీం అదరగొట్టగా, ఫ్రస్టేషన్ విత్ ఫన్‌తో రాకెట్ రాఘవ టీం అలరించారు. స్పెషల్ గెటప్‌లో వచ్చిన చంటి అందరిని అబ్బురపరిచాడు. ఎనర్జిటిక్ ఎంటర్‌టైన్మెంట్‌తో వెంకీ మంకీస్ టీం ఆకట్టుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఎపిసోడ్‌కు అతిధిగా వచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు చివరలో నాన్ స్టాఫ్ డైలాగ్‌తో కేక పుట్టించాడు. మరి ఇలాంటి ఆల్‌టైం బర్నింగ్ కామెడీ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ను ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక అంతవరకు ఆగలేమంటే మాత్రం ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :