జబర్దస్త్: అదరగొడుతున్న ప్రోమో.. ఒక్కరొజులోనే 30 లక్షల వ్యూస్..!

Published on Dec 21, 2021 7:40 pm IST


తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయించే కార్యక్రమాల్లో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటూ ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న వచ్చే వారానికి సంబంధించి “జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రోమో 3 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 70K ప్లస్ లైక్స్‌ని కూడా రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్‌కి కొన్ని అనివార్య కారణాలతో యాంకర్ అనసూయ హాజరుకాలేకపోవడంతో ఆమె స్థానంలో రష్మి ఎంట్రీ ఇచ్చింది. ‘నచ్చావే నైజాం పోరి’ అనే పాటకు రష్మీ చేసిన డ్యాన్స్‌ మతిపోగొట్టింది. ఇక ఆది ఎప్పటిలాగానే తన స్కిట్‌లో పంచుల ప్రవాహం నడిపించగా, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, అదిరే అభి తమదైన స్కిట్లతో అలరించారు. ఈ ఎపిసోడ్‌లో జడెజ్స్ అందరిని ‘పెర్ఫామర్‌ ఆఫ్ ది డే’గా ప్రకటించారు. మరీ ఈ ఫుల్ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే ఈ గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను తప్పక చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :