పుష్ప… పుష్పరాజ్…నీ యవ్వ తగ్గేదేలే…అంటున్న క్రికెటర్ జడేజా!

Published on Dec 23, 2021 9:30 pm IST


అల్లు అర్జున్ పుష్ప మేనియా మామూలుగా లేదు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో దేశం నలుమూలలకు పుష్ప వెళ్ళడం జరిగింది. సోషల్ మీడియా లో పుష్ప చిత్రం లోని డైలాగ్స్, పాటలకు, పలు వీడియో లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక అభిమానులు విడియోలు చేస్తూ ఇమిటేట్ చేస్తూ అలరిస్తున్నారు.

పుష్ప ది రైజ్ ట్రైలర్ లో పుష్ప… పుష్పరాజ్… నీ యవ్వ తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ప్రముఖ టీమ్ ఇండియా క్రికెటర్, ఆల్ రౌండర్ అయిన జడేజా ఈ డైలాగ్ ను చెబుతూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పాన్ ఇండియా మూవీ తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప, పుష్ప ది రూల్ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ లు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తం శెట్టి మీడియా లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :