విలన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జగ్గుభాయ్..!

Published on Oct 21, 2021 3:00 am IST


హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి అడుగుపెట్టిన జగపతిబాబు 60 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా మోస్ట్ హ్యాండ్సమ్ గా, ఫిట్‌గా కనిపిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఎలాంటి పాత్రలోనైనా తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. అయితే కొంత కాలంగా జగ్గుభాయ్‌కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్‌లు వస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే హిందీ సినిమాల్లో నటించే ఆసక్తి లేకపోవడంతో ఇన్ని రోజులు నో చెబుతూ వచ్చిన జగ్గుభాయ్.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే హిందీలొ అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ కోసం జగ్గుభాయ్‌కి పిలుపు వచ్చినట్టు టాక్. అవకాశాలు వదులుకోలేకే ఈ మూవీకి జగ్గు భాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :