‘సలార్’ లో తన రోల్ పై జగపతి బాబు క్లారిటీ

Published on May 3, 2023 9:21 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల కానుంది. హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరాగందూర్ దీనిని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం మూవీలో కీలక రోల్ చేస్తున్న జగపతిబాబు, ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగముగా సలార్ లో తన రోల్ గురించి క్లారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే, నా పాత్ర గురించి ఇంకా పెద్దగా సమాచారం లేదు. ఐదు రోజుల పాటు ఒకే ఒక్క సన్నివేశం చిత్రీకరించారని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అసాధారణమైన టాలెంట్ కలిగిన వ్యక్తి అని అందుకే సలార్ స్టోరీ, తన రోల్ గురించి ఎంక్వయిరీ చేయలేదని అన్నారు. ఇటువంటి టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీ అని తెలిపారు జగపతిబాబు. భువనగౌడ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :