పుట్టినరోజు నాడు కీలక నిర్ణయం తీసుకున్న జగపతి బాబు..!

Published on Feb 12, 2022 1:00 am IST

హీరో నుంచి విలన్‌గా టర్న్ తీసుకున్న నటుడు జగపతి బాబు తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అవయవదాన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగపతి బాబు తన అవయవాలను కూడా దానం చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ నేను సినిమాలో హీరో అయినా, విలన్ అయినా నిజజీవితంలో హీరోలాగే బతకాలనుకుంటున్నానని అందుకే హీరోలాగే నా అవయవాలను దానం చేస్తున్నానని అన్నాడు. మనిషిగా పుడతాం.. మనిషిగా పోతాం.. వెళ్ళేటప్పుడు ఎవరు ఏమి తీసుకెళ్లరు.. 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేమి మిగలదని అన్నారు. అవయవ దానం వల్ల మనం చనిపోయినా తర్వాత 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చని అన్నాడు. అవయవ దానం చేసిన వారికి కూడా పద్మశ్రీ, పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించాలని జగ్గుభాయ్ కోరాడు.

సంబంధిత సమాచారం :