“సలార్” లో తన రోల్ పై జగ్గూ భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jan 16, 2022 8:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఒక్కొక్కరి పాత్రని కూడా ఎంతో సాలిడ్ గా కూడా డిజైన్ చేసాడు.

అలా చేసిన వాటిలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు లుక్ ని రివీల్ చెయ్యగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా చూసాము. మరి ఇదిలా ఉండగా జగ్గూ భాయ్ లేటెస్ట్ గా తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఈ సినిమాలో తన రోల్ చాలా సాలిడ్ గా ఉంటుందని..

ప్రశాంత్ ఈ రోల్ పట్ల చాలా పర్టిక్యులర్ గా ఉన్నాడని ఖచ్చితంగా సలార్ లో నా పాత్ర ఇంకో మెట్టు ఎక్కించేదిలా అవుతుందని తెలిపాడు. ఇంకా ప్రస్తుతం నేను చేస్తున్న అన్ని సినిమాల్లో రెండు బెస్ట్ రోల్స్ తీసుకుంటే అందులో సలార్ లో చేస్తున్నది ఒకటని తెలిపారు. అంటే ఈ లెక్కన సలార్ లో తన పాత్ర ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :